సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 140 సంకీర్తన: 142
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 260
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 140 సంకీర్తన: 142
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 260
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| శ్రీరంగపతి ముద్దు - తీరంగ దమి తేరె సారంగలోచనలు - చేరంగ రారె | ॥పల్లవి॥ |
| కలికికావేరి తరగల - దేలి కంకణపు చెలువ ముత్తియపు - సేసలుచల్లగా బలువైన భోగీంద్రు - పడగగొడుగులనీడ కలశాంబునిధి కన్య - కను పెండ్లియాడె | ॥శ్రీరంగపతి॥ |
| తమితోడ సదరంపు - తామెర పై నుండు రమణి చూపులతొ నా - రతులియ్యగా మమత కెమ్మోవి బు - వ్వములారగింపుచును కమలనెచ్చెలిని భూ - కాంతఁ బెండ్లాడె | ॥శ్రీరంగపతి॥ |
| కెలన గనవచ్చు పొ - క్కిలి తమ్మిచౌమొగము నలువెంటబలు శోభ - నలుపాడగా చెలగి యలమేల్మంగ - శ్రీవేంకటేశుండు నెలత సయిదోడుగా - (నిలిపి) పెండ్లాడె | ॥శ్రీరంగపతి॥ |


