Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 203 సంకీర్తన: 213
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 262
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
శ్రీవేంకటేశ్వరుడున్నాడు - చేరి యలమేల్మంగతో[1]
భావించి మనవాండ్లు - బ్రతుకరే మీరు
॥పల్లవి॥
కుచ్చికుచ్చి యాతనినే - గోరి పాడరే
(రెచ్చి)[2] తమకము - రేచి మోహించరే
ముచ్చట గొత్తగా బద - ములు చెప్పరే
పచ్చిదేర నుతియించి - బ్రతుకరే మీరు
॥శ్రీవేంకటేశ్వరుడున్నాడు॥
మొగము జూచి యాతనినే - మోహించరే
నగుతా మేలమాడి యా - నందించరే
(తగిలి)[3] సేవసేసి ముం - దర నిలువరే
పగటునఁ బ్రార్థించి - బ్రతుకరే మీరు
॥శ్రీవేంకటేశ్వరుడున్నాడు॥
శరణుజొచ్చి యాతనినే - సారె నమ్మరే
వరముల రాయని(పాడి)[4] - వర్ణించరే
ఇరవై శ్రీవేంకటేశుఁ - డేలె నన్న(నరే)[5]
పరమునిహమునిచ్చీ(ని)[6] - బ్రతుకరే మీరు
॥శ్రీవేంకటేశ్వరుడున్నాడు॥

[1] పెదతిరుమలాచార్యులవారి పదమిది, వారి ప్రత్యేకముద్రతోనే ఆరంభించుట విశేషము. కోరిపాడుట, తమకము రేచి మోహించుట, ఆతనినే సారెనమ్ముట, పాడివర్ణించుట, ముచ్చటలుదీర క్రొత్తక్రొత్తగా పదములు చెప్పుట పదకర్త తమవారికి (‘మనవాండ్లకు’) చేసిన హితవు. కనుక వీరి పదముల అభివ్యక్తిలో క్రొత్తదనముండుట సహజమే.
[2] వెంచి
[3] తనివి
[4] చేర్పులు పరిష్కర్తవి
[5] చేర్పులు పరిష్కర్తవి
[6] పరమునిహమూనిచ్చి
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము