సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 130 సంకీర్తన: 132
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 267
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 130 సంకీర్తన: 132
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 267
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| సతముగావని నిన్ను - జట్టిగొనఁ గాక, ని న్నితర కాంతల దలచ - నిత్తునా వోరి | ॥పల్లవి॥ |
| యెంత పనిరా నాకు - నిటు నిన్ను వలపించ అంత సత్తా వుంటె(?) - నాడ గాక మంతనంబున కెదిరి - మాటాడ గాక, (?)ని న్నింత గుట్టున దిరుగ - నిత్తునా వోరి | ॥సతము॥ |
| యేమి యరుదునాకు - నిప్పుడిటు లలయించ నామాట గర్వించి - యాడె గాక కామతంత్రములచే - కరగింతుగాక, యి న్ని మేకులు సేయ - నిత్తునా వోరి | ॥సతము॥ |
| యెదురెవ్వతెర నాకు - నీ జగంబుల నెన్న నది యెరుంగదు వనుచు - నాడ గాక కదిసి యొడబరచి వేం - కటరాయ కూడితివి యిది మొదలు నిలు వెళ్ల - నిత్తునా వోరి | ॥సతము॥ |


