Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 66 సంకీర్తన: 65
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 268
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
(సవరని యందమది - చాల కప్పటి
తివిరి దిద్దగ నేలె - దిష్టిని తాకీని)
॥పల్లవి॥
(మలక) నెలవంక నా - మము చాల కప్పటి
తిలక మేటికె నీకు - దిష్టి తాకీని
పలుచ(గ) దిద్దు పా - పట చాల కప్పటి
తెలి జేరుచుక్కేలె - దిష్టి తాకీని
॥సవరని॥
జవ్వని కంటసరి - చాల కప్పటి
(తివ్వెలే) నీకు - దిష్టి తాకీని
(పువ్వని) కుంకుమ - పువు చాల కప్పటి
(దివ్వి) జవ్వా దేటికె - దిష్టి తాకీని
॥సవరని॥
మనసు రంజిలజేయు - మాట చాల కప్పటి
(దిన మనవు) లేటికే - దిష్టి తాకీని
(యెనసి) వేంకటప్ప - (డే)లుట చాలక
దినము ఱొమ్మొక్క నేలె - దిష్టి తాకీని
॥సవరని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము