సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 244 సంకీర్తన: 255
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 274
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 244 సంకీర్తన: 255
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 274
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్ర
| సిగ్గుతోడ గొంకితేను చిక్కునా మగవాఁడు బిగ్గెఁ గాఁగిలించుకొని పెనఁగినఁగాక | ॥పల్లవి॥ |
| పెదవిపై మాటలఁ బ్రియములు వుట్టునా వుదుటుగుబ్బలఁ బతి నూఁదినఁగాక సదరపుఁజెనకుల చవులు వుట్టీనా సదమదముగ రతి సలిపినఁ గాక | ॥సిగ్గు॥ |
| సెలవుల నవ్వితేనే చిత్తము గరఁగునా సొలయుచు మోవిచవి చూపినఁగాక ములువాఁడిచూపుల మోహములు వుట్టునా లలిఁ దమ్ములముపొత్తు గలసినఁగాక | ॥సిగ్గు॥ |
| సరసములాడితేనే సంగాతా లెనయునా సరుసఁ దనువు లొక్కజ(జం?) టైనఁ గాక యిరవై శ్రీవేంకటేశుఁడింతలోనె నిన్నుఁ గూడె పరపుపైనే చాలునా వురమెక్కినఁగాక | ॥సిగ్గు॥ |
(ఈ సంకీర్తన 18వ సంపుటంలో 161వ సంకీర్తనగా ఉంది.)


