అధ్యాత్మ సంకీర్తన
రేకు: 25-6
సంపుటము: 1-154
రేకు: 25-6
సంపుటము: 1-154
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| అతిశయమగు సౌఖ్య మనుభవింపుమన్న హితవు చేకొననొల్ల రిందరు | ॥అతిశయ॥ |
| కడలేని విజ్ఞానగతికిఁ దోడుగారు యెడపుల వారలె యిందరు అడరిన మోక్షసహాయు లెవ్వరు లేరు యిడుమపాట్లవారె యిందరు | ॥అతిశయ॥ |
| తిరమైన పుణ్యము బోధించేవారు లేరు యెరవులవారే యిందరు తిరువేంకటాచలాధిపుని మీఁది చిత్త- మిరవు సేయకపోయి రిందరు | ॥అతిశయ॥ |


