అధ్యాత్మ సంకీర్తన
రేకు: 26-5
సంపుటము: 1-160
రేకు: 26-5
సంపుటము: 1-160
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| కొండో నుయ్యో కుమతులాల తండుముండు తట్టుముట్టు తాఁకైనఁ గనుఁడీ | ॥కొండో॥ |
| కాకివోటు జముచేత కందుకుందు మరుచేత మా కాపని గాదు మనుజులాల పోకుమని యాఁపరాదు పొమ్మని చెప్పఁగరాదు మీకు మీకే చూచుకొండు మీరే కనుఁడు | ॥కొండో॥ |
| గాములిల్లు పుట్టమీఁది కప్పు తోలు పైకప్పు నేమా యెఱఁగము నిపుణులాల పాము నోరికడి మీప్రాణపు టూరుపుగాలి జాము జాము మేలుఁ గీడు చక్కఁజేయఁ గనుఁడు | ॥కొండో॥ |
| రచ్చమాని చింతకిందు రాఁపుల కూటమిపొందు ముచ్చో చిచ్చో మూఢులాల యెచ్చరికతోడ వేంకటేశుదాసులఁ గూడి పచ్చిగచ్చు మేనితోడ భయమెల్ల బాయుఁడు | ॥కొండో॥ |


