అధ్యాత్మ సంకీర్తన
రేకు: 36-5
సంపుటము: 1-224
రేకు: 36-5
సంపుటము: 1-224
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| అన్నలంటాఁ దమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా వన్నెల నప్పులు గొన్నవారువో వీరు | ॥అన్న॥ |
| తెగనీక అప్పులెల్లాఁ దీసితీసి । వారు తగిలినఁ బెట్టలేక దాఁగి దాఁగి వెగటునఁ బారిపోఁగా వెంట వెంట । పెక్కు వగల నప్పులు గొన్న వారువో వీరు | ॥అన్న॥ |
| సేయరాని పనులెల్లఁ జేసిచేసి । తమ- రాయడికి లోలోనే రాసిరాసి కాయములో చొచ్చిచొచ్చి కాఁచికాఁచి । మున్ను వ్రాయని పత్రాల కాఁగేవారువో వీరు | ॥అన్న॥ |
| దొరయై యప్పులవారిఁ దోసితోసి । యీ- పరిభవములనెల్లఁ బాసిపాసి సిరుల వేంకటపతిఁ జేరిచేరి । యిట్టి- వరుసనే గెలిచినవారువో వీరు | ॥అన్న॥ |


