Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 37-4
సంపుటము: 1-230
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
చెప్పుడుమాటలే చెప్పుకొనుట గాక
చెప్పినట్లఁ దాము సేయ రెవ్వరును
॥చెప్పుడు॥
దొడ్డయిన శరీరదోషమైనయట్టి
జడ్డు దొలఁగవేయఁజాల రెవ్వరును
గడ్డబడి యీఁతకాండ్లౌటగాని
వొడ్డు నడుమ నీఁద నోపరెవ్వరును
॥చెప్పుడు॥
శ్రీవేంకటేశుపైఁ జిత్త మర్పణ సేసి
యీవిధు లన్నియు నెడయ రెవ్వరును
చావుఁ బుట్టుగులేని జన్మముగల సర్వ-
దేవతామూర్తులై తిరుగ రెవ్వరును
॥చెప్పుడు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము