అధ్యాత్మ సంకీర్తన
రేకు: 4-6
సంపుటము: 1-26
రేకు: 4-6
సంపుటము: 1-26
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| అనుమానపు బ్రదు కది రోఁతా తన మన సెనయని కూటమి మరి రోఁతా | ॥అనుమాన॥ |
| అపకీర్తులఁ బడి ఆడికే లోనై అపవాదియౌట అది రోఁతా వుపమ [1]గెలిచేనని వొరుఁ జెరుచుటలు విపరీతపు గుణవిధ మొక రోఁతా | ॥అనుమాన॥ |
| తన గుట్టెల్లా నెరిఁగినవారల ముందట తన యెమ్మెలు చెప్పుకొనుట రోఁతా వనితల ముందట వదరుచు వదరుచు కనుఁగవ గానని గర్వము రోఁతా | ॥అనుమాన॥ |
| భువి హరి గతియని బుద్ధిఁ దలంచని యవమానపు మన సది రోఁతా భవసంహరుఁడై పరగు వేంకటపతి- నవిరళముగఁ గొలువని దది రోఁతా | ॥అనుమాన॥ |
[1] ‘గెలిచె’ అని పూ.ము.పా.


