అధ్యాత్మ సంకీర్తన
రేకు: 67-4
సంపుటము: 1-349
రేకు: 67-4
సంపుటము: 1-349
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| సకలసంగ్రహము సకలసంచయము అకృతకృత మిది హరినామం | ॥సకల॥ |
| సకలవేదశాస్త్రముల సార మిది సకలమంత్రరాజంబు నిది సకల పురాణరసముల మధుర మిది అకుటిలపావనం[1] హరినామం | ॥సకల॥ |
| సకలతత్వసంశయఖండన మిది సకలకర్మనిశ్చయము నిది సకలవిధిరహస్యప్రధాన మిది అకారణహితం హరినామం | ॥సకల॥ |
| సకలదేవతాస్వామిప్రియం బిది సకలలోకరక్షణము నిది ప్రకటం వేంకటపతి నామాంకిత- మకించనధనం హరినామం | ॥సకల॥ |
[1] (నిడురేకు 108) అఖిలపావనం.


