అధ్యాత్మ సంకీర్తన
రేకు: 70-6
సంపుటము: 1-369
రేకు: 70-6
సంపుటము: 1-369
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| [1]అతనికెట్ల సతమైతినో కడు- హితవో పొందుల హితవో యెఱఁగ | ॥అతని॥ |
| హృదయము తలఁపున నిరవయినఁగదా పదిలమౌను లోపలిమాట వెదకిన చిత్తము వెర వెఱఁగదు నే - నెదిరి నెఱఁగ నే నేమియు నెఱఁగ | ॥అతని॥ |
| కాలూఁద మనసు గలిగి కదా నా తాలిమి మతిలోఁ దగులౌట మేలిమి పతితో మెలఁగుటేదో నే - నేలో నే నిపుడెక్కడో యెఱఁగ | ॥అతని॥ |
| నేఁడని రేపని నే నెఱిఁగి కదా పోఁడిమి మతిలో పొలుపౌట వాఁడే వేంకటేశ్వరుఁడు రాఁగలిగె [2]ఆఁడుజన్మమేనౌటిది యెఱుఁగ | ॥అతని॥ |
[1] ఇది శృంగారకీర్తనలలో నుండదగినది.
[2] ఆఁడుజన్మము + ఏను + ఔట.


