అధ్యాత్మ సంకీర్తన
రేకు: 78-2
సంపుటము: 1-371
రేకు: 78-2
సంపుటము: 1-371
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| తప్పదు తప్పదు దైవము కృప యిది ముప్పిరి నింతా ముకుందుఁడే | ॥తప్పదు॥ |
| వెక్కసపు మతి వెలుతురు దీరిన- నెక్కడ చూచిన నీశ్వరుఁడే గుక్కక యాసలు గోసివేసినను నిక్క మడుగడుగు నిధానమే | ॥తప్పదు॥ |
| పొంచి శరీరపుభోగము లుడిగిన చుంచుఁబాపములు సుకృతములే[1] [2]దంచెడి విషయపు తగులమిఁ(ము?) బాసిన యెంచి చూచినను యిహమే పరము | ॥తప్పదు॥ |
| శ్రీవేంకటపతి సేవే కలిగిన వేవేలు వగలు వేడుకలే చేవదీరె సందియము లేదిదే[3] భావము నమ్మిన ప్రసన్నులకును | ॥తప్పదు॥ |
[1] ‘సుగృతములే’ రేకు.
[2] ‘దంచేటి’ రేకు.
[3] ఈ పాదమున యతి లేదు. ‘చావదీరె సంశయము లేనిదె’ అని పాఠము గాఁబోలును. ‘చేవ’యే ‘చావ’గా వ్రాతలోనుండుట సామాన్యము.


