Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 79-4
సంపుటము: 1-379
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
ఇందిరానాయక యిదివో మాపాటు
చెంది నీవే గతి చేకొనవయ్యా
॥ఇందిరా॥
తీసీఁ గోరిక తీదీపు లొకవంక
లాసీ సంసారలంపటము
మూసీఁ గర్మము మునుకొని పరచింత
సేసేదేమిఁకఁ జెప్పే దేమి
॥ఇందిరా॥
వంచీ నాసలు వలసినచోటికి
పొంచీ దుర్గుణభోగములు
ముంచీ యౌవనమోహాంధకారము
యెంచేదేమి సోదించేదేమి
॥ఇందిరా॥
యెఱిఁగీఁ జిత్తము యించుకించుక నిన్ను
మఱవని నీపై భక్తి మతినుండఁగా
నెఱి శ్రీవేంకటపతి నీవే కాతువుగాక
వెఱచి నేఁ జేసే విన్నపమేమి
॥ఇందిరా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము