అధ్యాత్మ సంకీర్తన
రేకు: 79-5
సంపుటము: 1-380
రేకు: 79-5
సంపుటము: 1-380
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| నారాయణాయ నమో నమో నానాఽఽత్మనే నమో నమో యీ రచనలనే యెవ్వరు దలఁచిన యిహపరమంత్రము లిందరికి | ॥నారాయణా॥ |
| గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో భావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో దేవేశాయ నమో నమో దివ్యగుణాయ నమో యనుచు యీ వరుసలనే యెవ్వరు దలఁచిన యిహపరమంత్రము లిందరికి | ॥నారాయణా॥ |
| దామోదరాయ నమో నమో ధరణీశాయ నమో నమో శ్రీమహిళా[1]పతయే నమో శిష్ట[2]రక్షిణే నమో నమో వామనాయ తే నమో నమో వనజాక్షాయ నమో నమో యీ మేరలనే యెవ్వరు దలఁచిన యిహపరమంత్రము లిందరికి | ॥నారాయణా॥ |
| పరిపూర్ణాయ నమో నమో [3]ప్రణవగ్రాయ(?) నమో నమో చిరంతన శ్రీవేంకటనాయక శేషశాయినే నమో నమో నరకధ్వంసే(?) నమో నమో నరసింహాయ నమో నమో యిరవుగ నీగతి నెవ్వరు దలఁచిన యిహపరమంత్రము లిందరికి | ॥నారాయణా॥ |
[1] ‘పతియేన్నమో’ రేకు.
[2] ‘రక్షణే’ రేకు.
[3] ‘పణవాగ్రాయ’ కావచ్చు.


