అధ్యాత్మ సంకీర్తన
రేకు: 82-2
సంపుటము: 1-394
రేకు: 82-2
సంపుటము: 1-394
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| సులభుఁడు మధుసూదనుఁడు మన- మెలమి నమ్మిన నిట్టే సుండీ | ॥సులభు॥ |
| పడుచు మాటన కా[1] ప్రహ్లాదునెదుట పొడచూపె నాదిపురుషుఁడు అడవి దేహనక ఆ దంతిమొఱకును తడవి కాచిన దైవము సుండీ | ॥సులభు॥ |
| ఆఁడుమాటలనక అంతలో ద్రౌపదిని వాఁడిమిఁ గాచిన వరదుఁడు పోఁడిమిఁ బేదనక పొందిన కుచేలుని[2] వీఁడె సంపదిచ్చె విష్ణుఁడు సుండీ[3] | ॥సులభు॥ |
| వీరువారన కిదె వేఁడిన వరములు సారెకు నిచ్చిన సర్వేశుఁడు మేరతో లోకముల మెఱసె నిప్పుడును యీ రీతి శ్రీవేంకటేశుఁడే సుండీ | ॥సులభు॥ |
[1] ‘ప్లంహ్లాదు’ రేకు.
[2] ‘కుచేలునికి’ లేక ‘కుచేలుకు’ కావచ్చు.
[3] ‘సుమ్మీ’ రేకు.


