అధ్యాత్మ సంకీర్తన
రేకు: 94-4
సంపుటము: 1-468
రేకు: 94-4
సంపుటము: 1-468
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| సకలజీవులకెల్ల సంజీవి యీ మందు వెకలులై యిందరు సేవించరో యీ మందు | ॥సకల॥ |
| మూఁడులోకము లొక్కట ముంచి పెరిగినది పోఁడిమి నల్లనికాంతిఁ బొదలినది పేఁడుక కొమ్ములు నాల్గు పెనచి చేయివారినది నాఁడే శేషగిరిమీద నాఁటుకొన్న మందు | ॥సకల॥ |
| పడిగెలు వేయింటిపాము గాచుకున్నది కడు వేదశాస్త్రముల గబ్బు వేసేది యెడయక వొకకాంత యెక్కువ వుండినది కడలేని యంజనాద్రిగారుడపు మందు | ॥సకల॥ |
| బలుశంఖుఁజక్రముల బదనికె లున్నది తలఁచినవారికెల్లఁ దత్వమైనది అలరిన బ్రహ్మరుద్రాదులఁ బుట్టించినది వెలుఁగుతోడుత శ్రీవేంకటాద్రి మందు | ॥సకల॥ |


