Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 98-4
సంపుటము: 1-492
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఇహమునుఁ బరమును యిందే వున్నవి
వహికెక్కఁ దెలియువారలు లేరు
॥ఇహము॥
చట్టువంటి దీ చంచలపు మనసు
కొట్టులఁ బడేది గుఱిగాదు
దిట్ట వొరులు బోధించినఁ గరఁగదు
పట్టఁబోయితే పసలేదు
॥ఇహము॥
చిగురువంటి దీ జీవశరీరము
తగుళ్లు పెక్కులు తతి లేదు
తెగని లంపటమే దినమునుఁ బెనచును
మొగము గల దిదే మొనయును లేదు
॥ఇహము॥
గనివంటిది యీ ఘనసంసారము
తనిసి తన్పినాఁ దగ లేదు
ఘనుడఁగు శ్రీవేంకటపతి గావఁగ
కొనమొద లేర్పడె కొంకే లేదు
॥ఇహము॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము