అధ్యాత్మ సంకీర్తన
రేకు: 99-3
సంపుటము: 1-497
రేకు: 99-3
సంపుటము: 1-497
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| ముంచిన వేడుకతోడ మొక్కుట గాక కంచములోపలి కూడు కాలఁదన్న నేఁటికి | ॥ముంచిన॥ |
| వేదార్థములు నీవే విహరించిన సుద్దులే కాదని అవునని కొన్ని వాదములేల యేది నీవు సేసినాను యిన్నియును నియ్యకోలే సోదించనేఁటికి యందు సొట్టు లెంచఁనేటికి | ॥ముంచిన॥ |
| కర్మము లిన్నియును నీ కైంకర్యసాధనాలే అర్మిలిఁ దారతమ్యము లడుగనేల నిర్మితము నీ దింతే నెరసు లెంచంగనేల ధర్మమందు నింక గజదంతపరీక్షేఁటికి | ॥ముంచిన॥ |
| భక్తి యింతా నొక [1]ఘంటాపథము నీ శావలే యుక్తిఁ బాత్రాపాత్రములు యూహించనేల ముక్తికి శ్రీవేంకటేశ మూలము నీ పాదములు సక్తులయి నమ్ముటగాక [2]చలపదమేఁటికి | ॥ముంచిన॥ |
[1] ‘ఘంటాపథమునిశావలె’ పూ.ము.పా. ‘నీ సేవలే’ అనుటకు ‘నీ శావలే’ వ్యావహారికము.
[2] చలపదము = తొట్రుకాలు కావచ్చు.


