అధ్యాత్మ సంకీర్తన
రేకు: 103-5
సంపుటము: 2-17
రేకు: 103-5
సంపుటము: 2-17
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| అంతరుమాలినయట్టి అధములాల పొంత సంతకూటమి పొరిచూపు గాదా | ॥పల్లవి॥ |
| కనక మిత్తడితోడ కలయ సరిదూఁచితే అనువవునా అది దోషమవుఁ గాక ఘనుఁడైన హరితోఁ గడుహీనదేవతల ననిచి సరివెట్టితే నయమవునా భువిని | ॥అంత॥ |
| పట్టభద్రుఁడు గూర్చుండే బలుసింహాసనముపై వెట్టిబంటుఁ బెట్టేవారు వెఱ్ఱులేకారా గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతలఁ బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా | ॥అంత॥ |
| కొంచక సింహముండేటి గుహ నుండవచ్చునా పొంచి నక్కలకెల్ల బొక్కలే కాక అంచెల శ్రీవేంకటేశుఁ డాత్మలోనే వుండఁగాను కొంచపుదైవాల పలువంచలనే కాక | ॥అంత॥ |


