అధ్యాత్మ సంకీర్తన
రేకు: 103-6
సంపుటము: 2-18
రేకు: 103-6
సంపుటము: 2-18
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| కల్లమాడ దొడ్డముద్ర కటకటా చెల్లుబడి కల్లలు చెప్పేరు లోకులు | ॥పల్లవి॥ |
| యిప్పుడేలే బ్రహ్మదేవుఁడిట్టే వుండఁగ మీఁదటి- వొప్పగు బ్రహ్మపట్టము వొకరికి వెచ్చపెట్టి అప్పటి మూఁడుమూర్తులయందులో నీతని సరి- చెప్పఁబొయ్యే రీమాట చెల్లునా లోకులకు | ॥కల్ల॥ |
| కైలాసము రుద్రుఁడుగల బ్రహ్మాండకోట్లు పోలించి విష్ణుఁడు కడుపున నించుకుండఁగాను చాలి మూఁడుమూర్తులలో సరి యీతఁ డంటాను కూళలై యాడేరు గాక కూడునా లోకులకు | ॥కల్ల॥ |
| ఘనుఁ డీతనిపాదము గడిగె బ్రహ్మదేవుఁడు మునుముట్టి శిరసున మోఁచె శివుఁడు వొనర మూఁడుమూర్తులం దొకఁడు శ్రీవేంకటేశుఁ- డనుమాట యిది తగవవునా లోకులకు | ॥కల్ల॥ |


