Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 156-3
సంపుటము: 2-265
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
నీకేల యీగుణము నీ వేమి గట్టుకొంటివి
యీకడ లాలించితే మే మిటు నిన్ను గొలుతుము
॥పల్లవి॥
మాటలకు లోఁగాని బ్రహ్మమనంటా దాఁచి దాఁచి
మాటాడకుండేవు సుమ్మీ మాతో నీవు
నీటున మనసులో నిలుపరానివాఁడనంటా
పాటించి మాకుఁ బొడచూపకుంటే గతి యేది
॥నీకే॥
శ్రుతులకుఁ బట్టరాని చోద్యపు బ్రహ్మమనంటా
మతకానఁ జిక్కక మానేవు సుమ్మీ
పతివి నీ గంభీరము బయటఁబడీ నంటా
అతిగోప్యాన ని న్నది యెట్ఱెఱిఁగేము
॥నీకే॥
మాయవన్నుకొనిన వుమ్మడిబ్రహ్మమనంటా
యేయడనైననా భ్రమయించేవు మ్మీ
పాయపు టలమేల్మంగపతివి శ్రీవేంకటేశ
యీయెడ నీశరణంటి మిన్నిటా మమ్మేలుమీ
॥నీకే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము