Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 166-2
సంపుటము: 2-318
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
జతనము జతనము సర్వేశు నగరిది
బతుకుఁ దోవ యిదె బడకరము
॥పల్లవి॥
హృదయములోపల నీశ్వరుఁడున్నాఁడు
పదిలము మనసా బడకరము
తుద నల కామాదులఁ జొర నియ్యక
పదరక కావుము బడకరము
॥జత॥
యెంచుకొనీనిదే యేలిక మిము నిఁక
పంచభూతములాల బడకరము
మించిన పురి తొమ్మిదివాకిళ్లను
పంచుక వున్నారు బడకరము
॥జత॥
నడుమ నడుమఁ బ్రాణములాలా మీరు
బడివాయకుండరో బడకరము
యెడయక శ్రీవేంకటేశ్వరునకు మీరు
బడలక కొలువరో బడకరము
॥జత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము