అధ్యాత్మ సంకీర్తన
రేకు: 177-1
సంపుటము: 2-381
రేకు: 177-1
సంపుటము: 2-381
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
| జగమంతా నీమయము సర్వం విష్ణుమయంబు గాన యెనయుచు నేఁగర్మమార్గముల నితరదేవతల భజియించెదను | ॥పల్లవి॥ |
| యెనయుచు నేఁగర్మమార్గముల నితరదేవతల భజియించెదను అని యపరాధం బెంచకుమీ అన్యము నీకంటె మరి లేదు పనివడి "మత్తఃపరతరం" బని పలికితి విన్నియు నీ యాజ్ఞలు | ॥జగ॥ |
| దేవ నావుదరపోషణకు తివిరి హింస చేసెదను నీ విది నావల నెంచకుమీ నీవే అఖండ చేతన్యుఁడవు దేవ మిము "నై తేన వినా తృణాగ్రమపి" యని శ్రుతి వొగడెడిని | ॥జగ॥ |
| భువిలో నాకట పూర్వకర్మమట పొఁగదునే నీసరణి నీయడను అవి నా కేమియుఁ బనిలేవు అంతరియామివి నీవు అవలను "త్వమేవ శరణం గతి" యనుటది నమ్మితి శ్రీవేంకటనిలయా | ॥జగ॥ |


