అధ్యాత్మ సంకీర్తన
రేకు: 178-4
సంపుటము: 2-389
రేకు: 178-4
సంపుటము: 2-389
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| అదియేల తా మాను మాయందు నిష్టూరమే కాక చెదరి విత్తొకటియుఁ జెట్టొకటి యౌనా | ॥పల్లవి॥ |
| కడుఁ బుణ్యపాపాలు గలిగిన జన్మము చెడుఁ బుణ్యపాపాలు సేయకుండీనా పుడమిలో ముష్టిమానఁ బొడమిన శాఖలు బడి ముష్టిపండ్లై పండకుండీనా | ॥అది॥ |
| పంచేంద్రియాలఁ బుట్టి పరగిన యీమేను పంచేంద్రియాలమీఁది భ్రమ మానీనా పొంచి హేయములోనఁ బుట్టిన కీటములెల్ల కొంచి హేయమే చవిగొనకుండీనా | ॥అది॥ |
| శ్రీవేంకటేశ నీవుచేసిన యీమాయలు నీవల్ల మానుఁ గాక నేఁ గర్తనా దైవమవై నాలోనఁ దగిలి నాదుర్గుణాలు వేవేగ మానుపఁగ వెతదీరెఁ గాక | ॥అది॥ |


