అధ్యాత్మ సంకీర్తన
రేకు: 179-5
సంపుటము: 2-396
రేకు: 179-5
సంపుటము: 2-396
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భవుళి
| జలజనాభ హరి జయ జయ యిల మా నేరము లెంచకువయ్యా | ॥పల్లవి॥ |
| బహుముఖముల నీప్రపంచము సహజగుణంబుల చంచలము మహిమల నీ విది మరి దిగవిడువవు విహరణ జీవులు విడువఁగఁగలరా | ॥జల॥ |
| పలునటనల యీప్రకృతి యిది తెలియఁగఁ గడునింద్రియవశము కలిసి నీ వందే కాఁపురము మలినపు జీవులు మానఁగఁగలరా | ॥జల॥ |
| యిరవుగ శ్రీవేంకటేశుఁడ నీమాయ మరలుచ నీవే సమర్థుఁడవు శరణనుటకే నే శక్తుఁడను పరు లెవ్వరైనాఁ బాపఁగఁగలరా | ॥జల॥ |


