అధ్యాత్మ సంకీర్తన
రేకు: 180-3
సంపుటము: 2-399
రేకు: 180-3
సంపుటము: 2-399
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఇదివో వున్నార మింతట నంతట వెదకి కదియకుమీ విష్ణుని మాయ | ॥పల్లవి॥ |
| హరిదాసులము హరికింకరులము కరివరదుని డింగరులము యిరవెఱిఁగితిననక యెఁఱగననక సరి మాగురుతిది సర్వేశు మాయ | ॥ఇది॥ |
| హితులము శరణాగతులము కేశవ- వ్రతులము వైష్ణవమతులము గతి నినుఁ బాసితి కడు నిఁక మామీఁద తతి దయమరవకు దైవము మాయ | ॥ఇది॥ |
| శ్రీవైష్ణవులము శ్రీవేంకటపతి భావింప నితని పరికరము యీవలనావల నిహపరములకును తోవ దొలఁగుమీ తొలిఁదొలి మాయ | ॥ఇది॥ |


