Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 180-5
సంపుటము: 2-401
సంస్కృతకీర్తన
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మంగళకౌశిక
తే శరణ మహం తే శరణ మహం
శైశవకృష్ణ తే శరణం గతో‌ఽస్మి
॥పల్లవి॥
దశవిధావతార ధర్మరక్షకమూర్తి
దశమస్తకాసురదశన
దశదిశాపరిపూర్ణ తపనీయస్వరూప
దశావరణ లోకతత్వాతీత
॥తే శ॥
సహస్రలోచన సంతతవినుత
సహస్రముఖశేషశయనా
సహస్రకరకోటిసంపూర్ణతేజా
సహస్రారదివ్యచక్రాయుధా
॥తే శ॥
అనంతచరణ సర్వాధారాధేయ
అనంతకరదివ్యాయుధా
అనంతనిజకల్యాణగుణార్ణవ
అనంత శ్రీవేంకటాద్రినివాసా
॥తే శ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము