అధ్యాత్మ సంకీర్తన
రేకు: 181-1
సంపుటము: 2-403
రేకు: 181-1
సంపుటము: 2-403
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: తెలుఁగుకాంబోది
| చూచి మోహించకుందురా సురలైన నరులైన తాచి నీవు ముందరఁ బ్రత్యక్షమైనను | ॥పల్లవి॥ |
| భాగీరథి పుట్టిన పాదపద్మములు భోగపు మరుని జన్మభూమి నీ తొడలు యోగపు నవబ్రహ్మలుండిన నీ నాభి సాగరకన్యక లక్ష్మి సతమైన వురము | ॥చూచి॥ |
| అందరి రక్షించేటి అభయహస్తము కంద నసురులఁ జంపే గదాహస్తము సందడి లోకముల యాజ్ఞాచక్రహస్తము చెంది ధ్రువు నుతియించఁ జేయు శంఖహస్తము | ॥చూచి॥ |
| సకల వేదములుండే చక్కని నీ మోము వొకటై తులసిదేవి వుండేటి శిరసు ప్రకటపు మహిమలఁ బాయని నీ రూపము వెకలి శ్రీవేంకటాద్రి విభుఁడ నీ భావము | ॥చూచి॥ |


