అధ్యాత్మ సంకీర్తన
రేకు: 181-4
సంపుటము: 2-406
రేకు: 181-4
సంపుటము: 2-406
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| గొరబై మొదలుండఁగఁ గొనలకు నీరేల దొరదైవ మితఁడే తుదఁగల ఫలము | ॥పల్లవి॥ |
| క్రతువులు హరియే కర్మము హరియే పితరులకు హరియే పెనుఁదృప్తి సతతమంత్రముల సారము హరియే యితనిసేవే పో యిన్నిటి ఫలము | ॥గొర॥ |
| అనలము హరియే ఆహుతి హరియే జననీజనకుల సరవి హరే పనివడి వేదముఁ బ్రణవము హరియే యెనసితని పూజ యిన్నిట ఫలము | ॥గొర॥ |
| యేలికె హరియే యిరవును హరియే వాలాయము సర్వము హరియే కాలము శ్రీవేంకటగిరి హరియే నేల నీతని శరణే సఫలంబు | ॥గొర॥ |


