అధ్యాత్మ సంకీర్తన
రేకు: 181-5
సంపుటము: 2-407
రేకు: 181-5
సంపుటము: 2-407
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| దొంతివిషయములాల దొరలాల చెంత మీఁదటి బుద్ధి చెప్పరో మాకు | ॥పల్లవి॥ |
| దురితంబు లొకకొన్ని దుర్గుణము లొకకొన్ని మరుగుటలు గొన్ని మర్మములు గొన్ని ధర నెరుక లొకకొన్ని తగ నెరఁగములు గొన్ని యిరవు మనపంట లివి యెందు వోయుదమో | ॥దొంతి॥ |
| ఆస లొకకొన్ని మిథ్యాచారములు గొన్ని వాసు లొకకొన్ని గర్వములు గొన్ని రేసు లోకకొన్ని మీరినరుచులు నొకకొన్ని యీసునఁ గడించితిమి యిముడఁ జోటేదో | ॥దొంతి॥ |
| వైరాగ్యములు గొన్ని వరభక్తు లొకకొన్ని నేరుపులు గొన్ని యిన్నియునుఁ గలిగి యీరీతి శ్రీవేంకటేశుగతి చేరితిమి మేర మిము మీరితిమి మీకు గతి యేదో | ॥దొంతి॥ |


