అధ్యాత్మ సంకీర్తన
రేకు: 181-6
సంపుటము: 2-408
రేకు: 181-6
సంపుటము: 2-408
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
| ఏ వుపాయములు మాకిఁకఁ బనికిరావు నీవే హరి కావవే నిరుహేతుకమున | ॥పల్లవి॥ |
| యివల నింద్రియజయం బేడ నే నేడ భువి నింద్రియములతోఁ బుట్టే నీతనువు అవల నిశ్చలబుద్ధి అది యేడ నే నేడ భవము చంచలమనసు పంగెమే యెపుడు | ॥ఏవు॥ |
| యెలమిఁ గర్మవిముక్తి యేడ నే నేడ తెలియంగఁ గర్మాధీన మీబ్రదుకు కుళకమగు సాత్త్వికపుగుణ మేడ నే నేడ కలియుగం బిది యిందుఁ గలవాఁడ నేను | ॥ఏవు॥ |
| తనివోని ఘోరతప మేడ నే నేడ అనిశంబు నీకు శరణాగతుఁడను యెనలేని శ్రీవేంకటేశ్వరుఁడ నీబిరుదు కనుఁగొనఁగ శరణాగతపారిజాతం | ॥ఏవు॥ |


