| కీర్తనలు | దాసు శ్రీరాములు | ఏమని తెల్పుదునే - కోమలి నాభాగ్య |
| ఫరజు - చాపు | ||
| పల్లవి: | ||
| ఏమని తెల్పుదునే - కోమలి నాభాగ్య మేమని తెల్పుదునే - నా ముద్దుసామికి నామీద ప్రేమ | ॥నేమని॥ | |
| చరణ: | ||
| చెక్కిలి ముద్దాడెనే - చక్కని నాసామి చెక్కిలి ముద్దాడెనే నిక్కముగ నిన్నరేయి - ప్రక్కనే పవ్వళించి చక్కని కెమ్మోవి నొక్కెనే | ॥ఏమని॥ | |
| బాళిచే నన్నేలెనే - కేళిలో నాసామి బాళిచే నన్నేలెనే వేళగదే రారమ్మని - విలువగల సొమ్ములిచ్చి చాలగా లాలించెనే - సోలెనే బాల నే | ॥నేమని॥ | |
| నాసాటి పేరనెనే - వేణుగోపాలుడు నాసాటి పేరనెనే ఆసదీర్చి రామ | - దాసకవి చిత్త వాసుడాయె పూసెనే గంధము - చేసెనే బాస నే | ॥నేమని॥ |