| కీర్తనలు | దాసు శ్రీరాములు | ఇంత మోహమా సామి - ఇంత మోహమా |
| దర్బారు - రూకపం | |
| పల్లవి: | |
| ఇంత మోహమా సామి - ఇంత మోహమా ఇపుడె రావలెన సామి | ॥ఇంత॥ |
| చరణ: | |
| అక్కటక్కటా వేగు - చుక్క బొడిచెనో లేదో కొక్కొరోకో యనుచు తొలి - కోడి గూసెరా చిక్కియున్న కసర కసర - చీకటిలో నిదురలేక ఇక్కడకు రానుపోను - యీ ప్రయాసమేల సామి | ॥ఇంత॥ |
| జుంటి తేనెలొలుకు దొండ - పంటి వంటి మోవి మీద గంటు జూడగా యొడలు - మంట లెక్కెరా ఒంటిగానె వచ్చితివో - వెంటనొకతె యున్నదో జంట విడవు రేపు దాని - తంటాలేమి యున్నవో | ॥ఇంత॥ |
| వినుము తోట్ల వల్లూరి - వేణుగోపాల నీ కనుల ఎరుపు చెక్కుల నలుపు - గనుగొంటినిరా నిను నే నొకటన నేటికి - నిజమాడిన నిష్ఠురమే ఘనుడ దాసు శ్రీరామ - కవి వందిత మునివందిత | ॥ఇంత॥ |