| కీర్తనలు | దాసు శ్రీరాములు | మనసు దీరెనా సామి - మనసు దీరెనా సామి |
| దర్బారు - మిశ్రచాపు | |
| పల్లవి: | |
| మనసు దీరెనా సామి - మనసు దీరెనా సామి వనజాక్ష దాని పొందు - వైకుంఠ మాయెనా | ॥మనసు॥ |
| చరణ: | |
| మరుగు పరచ నేటికిరా - మంచిది లేరా మెరుగు బోణి వగలు - తిరుమంత్రము లాయెనా | ॥మనసు॥ |
| చొక్కియున్న జాడలు - చూచిన చాలు దాని ప్రక్క బండి యుండుటే - బ్రహ్మానంద మాయెనా | ॥మనసు॥ |
| వినుము తోట్ల వల్లూరి - వేణుగోపాల శౌరి ఘనుడు దాసు శ్రీరామ - కవి సన్నుతి జేసెనా | ॥మనసు॥ |