కీర్తనలు తూము నరసింహదాసు మనుజాధముల వేడవలెనా - అవమానములకు నోర్వగలనా
బిలహరి - ఆట
పల్లవి:
మనుజాధముల వేడవలెనా - అవమానములకు నోర్వగలనా
(దు) తనువు నీ సొమ్ముగఁ దలచి యర్పణఁ జేసి -
వినుతించుచున్నట్టి వెలలేని నోట
చరణము(లు):
ఇమ్మహి మెప్పింప బ్రహ్మకు వశమా - తమ్మిచూలిం గన్న తండ్రి పరవశమా
(దు) యిమ్ముగా నీ పాదములు నా సొమ్మనుచు నెమ్మనములోపల
నమ్మితే కొనసాగ దారె న్నాళ్లపనికై యీగి యీ భువి
క్షధకోడి భువి గ్రామశునకమువలెను వెతఁ జెంది తిరుగ నావల నేమిగనను
(దు) అధముడని నా కన్నులకు నీ వగపడక యున్నావు మేలగు
సుధనుఁ జెందిన నామ మిక నెచ్చోట దాచెద వదియు గలుగగ
అభిమాన మొక యిసుమంతైన లేదా - రభసము జేసినిరాకరించేదా
(దు) అభయదాన మొసంగవే మును - నార్తులై మిము వేడువారికి
యిభవరద ననుఁ బ్రోచుటకు - నీకింత భారంబాయె ననుచును
అక్షీణ కరుణా కటాక్షమె చాలు - నక్షయ మౌ మాకు నదియె వెయివేలు
(దు) కక్ష సేయగ నేల నాకిక - రక్షకుడ వీవనుచు విధి మును
నక్షరంబులు నుదుట వ్రాసెను - పక్షివాహన నీవు గలుగగ
వాసవాదులు నిన్ను వర్ణింపలేరు - నాసరివారెల్ల నవ్వుచున్నారు
(దు) వాసిగా నిను గొలిచి యితరుల - వలెను వేసట నొందితే సం
తోషమా వినకుండు టిది యొక లేశమా నా దోసమా
డాసి శ్రీనారసింహదాసుని నింక - వేసార వలదనవేమొ బిరుదాంకా
(దు) గాసి బడి నీదాసజనములు గడుగృశించుచు నరుల సన్నుతి
జేసి వంచనబడుట నీకు విలాసమా దరహాసమా
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - manujaadhamula veeDavalenaa - avamaanamulaku noorvagalanaa - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )