కీర్తనలు తూము నరసింహదాసు నేడు గదా రఘురాముని పదములు చూడగల్గె మనకు చూడఁ
సావేరి - ఆది
పల్లవి:
నేడు గదా రఘురాముని పదములు చూడగల్గె మనకు చూడఁ
జూడఁ దొలిజన్మ ఫలంబని చేడియ నామది వీడఁగ దోచెనో
చరణము(లు):
రాగాదులు విడనాడి మనమునను - యోగులు గొలిచిన యోగ్యమేమో భా -
గీరధి గన్న భాగ్యముననే హరి -భక్తుల సేవకుఁ బాత్రుడ నగుటనో
ఈమహిలో నా మునుజన్మంబున నేమి దానముల నిచ్చితినో
సాముల గన్గొని సాగి నమస్కృతు లేమయినఁ జేసితి నేమొ యాఫలమున
కారులు పల్కక కడువేడుకతో - గోరి హరిని మది గొలిచిన ఫలమొ -
ధారుణి నరసింహదాసుడననుచు - పేరు ప్రతిష్ఠకు బెట్టుకొన్నందుకు
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - neeDu gadaa raghuraamuni padamulu chuuDagalge manaku chuuDa.r - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )