| కీర్తనలు | తూము నరసింహదాసు | భద్రాద్రికి నిదుగో మేము పయనమైతిమి రామ |
| ఆనందభైరవి - ఆది |
| పల్లవి: |
| భద్రాద్రికి నిదుగో మేము పయనమైతిమి రామ భద్రుని సేవించుమార్గ పదవి గంటిమి |
| చరణము(లు): |
| వినయముతో భక్తులకు విన్నవించితి మీరు చనుమని యాజ్ఞసేయుటకు సంచలింపుచు |
| ఎందుఁజూచిన సుఖము యింతైన లేదు, గో విందునిఁ గొలిచిన ఫలమెందు సరిరాదు |
| చిన్ననాటినుండి ద్రోహము లెన్నో చేసితి నా పన్నరక్షకుని దలచి యన్ని బాసితి |
| భద్రాద్రివాసుడె మనకు భారకుడంటి నితర క్షుద్రదైవములదిక్కుఁ జూడనని యుంటి |
| సారసనేత్రిరో భక్తిమీరి యుందము తూము నారసింహపోషకునిఁ జేరి కందాము |