| కీర్తనలు | తూము నరసింహదాసు | ఎవ రేమన్నారురా రాఘవ - ని న్నెవ రేమన్నారురా |
| నాదనామక్రియ - చాపు |
| పల్లవి: |
| ఎవ రేమన్నారురా రాఘవ - ని న్నెవ రేమన్నారురా |
| అనుపల్లవి: |
| ఎవ రేమన్నారు యినకులతిలక - నా చెవిలోన దెల్పు మావల వారి దండింతు |
| చరణము(లు): |
| బాలురతో నాడి చాలయలసినావు పాలిత్తు రమ్మన్న పరుగెత్తి డాగేవు |
| పిలిచిన బలుకవు నిలచి మాటాడవు అలుకలు చేసెదవు ఆర్తశరణ్యా |
| ఇందు రమ్మని కర మంది పట్టినఁ బెనగి చిందులు ద్రొక్కెద వెందుకురా సామి |
| ధరణిని నరసింహదాసుని వెంట నీ వర లేక యున్నవాడ వనుచు నోర్వలేక |