| మనోరంజని - ఆది |
| పల్లవి: |
| అటుకారాదని బల్క నభిమానము లేకపోయెనా అ.. |
| అను పల్లవి: |
ఎటులోర్తును ఓ దయఁజూడవయ్య
ఏ వేల్పు సేయు చలమో దెలిసి అ.. |
| చరణము(లు): |
వేదశాస్త్రోపనిషద్విదుఁడైన
నిజదారినిబట్టి దాసుఁడైన
నాదుపై నెపమెంచితే త్యాగరాజనుత అ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - aTukaaraadani balka nabhimaanamu leekapooyenaa ( telugu andhra )