| కీర్తనలు | త్యాగరాజు | అట్ట బలుకుదు విట్ట బలుకుదు వందుకేమిసేతు రామ |
| అఠాణ - ఆది |
| పల్లవి: |
| అట్ట బలుకుదు విట్ట బలుకుదు వందుకేమి సేతు రామ? నీ ॥వాట్ట॥ |
| అను పల్లవి: |
| తొట్లనర్భకుల నూతువు; మఱి మఱి తోచినట్టు గిల్లుదువు; శ్రీరామ! నీ ॥వాట్ట॥ |
| చరణము(లు): |
| జీవుల శిక్షించగ నేర్తువు; చిరం జీవులుగాఁ జేయ నేర్తువురా భావ మెఱిఁగి బ్రోతువు; సద్భక్త - భాగధేయ! శ్రీత్యాగరాజ వినుత! ॥అట్ట॥ |