| కీర్తనలు | త్యాగరాజు | అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా |
| మధ్యమావతి - రూపకం |
| పల్లవి: |
| అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా? ఆదిమూలమా! రామ! ॥అడిగి॥ |
| అను పల్లవి: |
| సడలని పాప తిమిరకోటిసూర్య! సార్వభౌమ! సారసాక్ష! సద్గుణ! ని ॥న్నడిగి॥ |
| చరణము(లు): |
| ఆశ్రయించి వరమడిగిన సీత యడవికిఁ బోనాయె; ఆశరహరణ! రక్కసి యిష్టమడగ నపుడె ముక్కువోయె; ఓ రామ! ని ॥న్నడిగి॥ |
| వాసిగ నారదమౌని వరమడుగ వనిత రూపుఁడాయె, ఆశించి దూర్వాసులు అన్నమడుగ అపుడె మందమాయె; ఓరామ! ని ॥న్నడిగి॥ |
| సుతుని వేడుక జూడ దేవకియడుగ య శోద జూడ నాయె; సతులెల్ల రతి భిక్షమడుగ వారివారి పతుల వీడనాయె; ఓరామ! ని ॥న్నడిగి॥ |
| నీకేఁ దయబుట్టి బ్రోతువో! బ్రోవవో! నీ గుట్టు బయలాయె; సాకేతధామ! శ్రీత్యాగరాజనుత! స్వామి! యేటి మాయ? ఓరామ! ని ॥న్నడిగి॥ |