| జంగలా - ఆది |
| పల్లవి: |
| అనాథుఁడనుగాను రామ నే ॥న॥ |
| అను పల్లవి: |
అనాథుఁడవు నీవని నిగమజ్ఞుల
సనాతనులమాట విన్నాను నే ॥న॥ |
| చరణము(లు): |
నిరాదరపుఁజూచి ఈ కలి
నరాధములనేరు
పురాణపురుష పురరిపునుత నా
గరాట్ఛయన త్యాగరాజనుత నే ॥న॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - anaathu.rDanugaanu raama nee ( telugu andhra )