| కీర్తనలు | త్యాగరాజు | అనుపమగుణాంబుధీ యని నిన్ను |
| అఠాణ - జంప |
| పల్లవి: |
| అనుపమగుణాంబుధీ యని నిన్ను నెరనమ్మి యనుసరించినవాడనైతి ॥అ॥ |
| చరణము(లు): |
| మనుపకయె యున్నావు మనుపతీ వ్రాసి మేననుప మాకెవరు వినుమా దయరాని ॥అ॥ |
| జనకజామాతవై జనకాజామాతవై జనక జాలము చాలు చాలును హరీ ॥అ॥ |
| కనక పటధర నన్ను కన కపటమేల తను కనకపఠనము సేతుగాని బూని ॥అ॥ |
| కలలోన నీవే సకలలోకనాథా కో కల లోకువగనిచ్చి గాచినది విని ॥అ॥ |
| రాజకుల కలశాబ్ధరాజ సురపాల గజ రాజ రక్షక త్యాగరాజ వినుత ॥అ॥ |