| సరస్వతి - రూపకం |
| పల్లవి: |
| అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు అ.. |
| అను పల్లవి: |
| ఘనులైన యంతర్జ్ఞానుల కెఱుకేగాని అ.. |
| చరణము(లు): |
వగవగగా భుజియించువారికి తృప్తియౌరీతి
సగుణధ్యానముపైని సౌఖ్యము త్యాగరాజనుత అ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - anuraagamu leeni manasuna suj~naanamu raadu ( telugu andhra )