| వనాళి - ఆది |
| పల్లవి: |
అపరాధముల నోర్వ సమయము
కృప జూడు ఘనమైన నా అ.. |
| అను పల్లవి: |
చపలచిత్తుఁడై మనసెఱుఁగకనే
జాలికలుగజేసుకొని మొరలనిడే అ.. |
| చరణము(లు): |
సకలలోకుల ఫలాఫలము లెఱిఁగి
సంరక్షించుచునుండఁగ న
న్నొకని బ్రోవ తెలియును కీర్తన సుశతక
మొనర్చుకొన్న త్యాగరాజుని అ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - aparaadhamula noorva samayamu ( telugu andhra )