| కీర్తనలు | త్యాగరాజు | అమ్మ ధర్మసంవర్ధని, యాదుకోవమ్మ |
| అఠాణ - ఆది |
| పల్లవి: |
| అమ్మ ధర్మసంవర్ధని, యాదుకోవమ్మ మా ॥యమ్మ॥ |
| అను పల్లవి: |
| ఇమ్మహిని నీ సరి యెవరమ్మ శివుని కొమ్మ మా ॥యమ్మ॥ |
| చరణము(లు): |
| ధాత్రి! ధరనాయక ప్రియ పుత్రి మదనకోటి మంజుళ గాత్రి అరుణ నీరజదళ నేత్రి నిరుపమ శుభ గాత్రి పీఠనిలయె వర హ స్తధృత వలయె పరమ ప విత్రి భక్త పాలన ధురంధరి వీరశక్తి నే నమ్మినా ॥నమ్మ॥ |
| అంబ కంబుకంఠి చారుక దంబ గహన సంచారిణి బింబాధర తటిత్కోటి నిభాభరి దయావారినిధే శంబరారి వైరి హృచ్చంకరి కౌమారి స్వరజిత తుంబురు నారద సంగీత మాధుర్యె దురితహారిణి మా ॥యమ్మ॥ |
| ధన్యే త్ర్యంబకె మూర్థన్యె పరమయోగి హృదయ మాన్యె త్యాగరాజకుల శ రణ్యె పతితపావని కా రుణ్యసాగరి సదా అపరోక్షము గారాదా సహ్య కన్యా తీరవాసిని పరాత్పరి కాత్యాయని రామసోదరి మా ॥యమ్మ॥ |