| కీర్తనలు | త్యాగరాజు | అమ్మ రావమ్మ తులసమ్మ నను పాలింపవమ్మ |
| కల్యాణి - ఝంప |
| పల్లవి: |
| అమ్మ! రావమ్మ తులసమ్మ నను పాలింప వమ్మ! సతతము పదములే నమ్మి నానమ్మ ॥అమ్మ॥ |
| అను పల్లవి: |
| నెమ్మదిని నీ విహ పరమ్ము లొసగుదు వనుచు కమ్మవిల్తుని తండ్రి గలనైన బాయడట ॥అమ్మ॥ |
| చరణము(లు): |
| నీ మృదు తనువును గని - నీ పరిమళమును గని నీ మహత్వమును గని - నీరజాక్షి తామరస దళనేత్రు - త్యాగరాజునిమిత్రు ప్రేమతో శిరమునను - బెట్టుకొన్నాడట ॥అమ్మ॥ |