| మధ్యమావతి - రూపకము |
| పల్లవి: |
| అలక లల్లలాడఁగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో ॥అ॥ |
| అను పల్లవి: |
| చెలువు మీఱఁగను మారీచుని మదమణఁచే వేళ ॥అ॥ |
| చరణము(లు): |
ముని కనుసైగఁ దెలిసి శివ - ధనువును విఱిచే సమయ
మున త్యాగరాజ విను - తుని మోమున రంజిల్లు ॥అ॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - alaka lallalaaDa.rga gani aa raaNmuni eTu poMgenoo ( telugu andhra )