| కీర్తనలు | త్యాగరాజు | ఇంత సౌఖ్యమని నేఁ జెప్పజాల |
| కాపి - ఆది |
| పల్లవి: |
| ఇంత సౌఖ్యమని నేఁ జెప్పజాల ఎంతో యేమో యెవరికిఁ దెలుసునో? ఇం.. |
| అను పల్లవి: |
| దాంత! సీతాకాంత! కరుణా స్వాంత! ప్రేమాదులకే దెలుసునుగాని ఇం.. |
| చరణము(లు): |
| స్వరరాగలయ సుధారసమందు వర రామనామమనే కండ చ క్కెర మిశ్రముఁజేసి భుజించే శం కరునికి దెలుసును త్యాగరాజవినుత ఇం.. |